ETV Bharat / bharat

పరీక్ష రాసేందుకు వెళ్లి మహిళ ప్రసవం- బాబుకు 'టెట్​'గా నామకరణం - amroha latest news

ఉపాధ్యాయుల అర్హత పరీక్ష(టెట్) రాస్తుండగా ఓ గర్భవతికి పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్సులో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సిబ్బంది ఆ పసివాడికి 'టెట్'​ అని పేరు పెట్టారు.

UP examinee gives birth to a baby boy during exam; newborn named after TET
పరీక్ష రాస్తూ ప్రసవించిన మహిళ- బాబుకు 'టెట్​'గా నామకరణం
author img

By

Published : Jan 24, 2022, 4:23 PM IST

Updated : Jan 24, 2022, 7:31 PM IST

యూపీ టెట్​(ఉత్తర్​ప్రదేశ్​ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష) రాస్తున్న మహిళకు పుట్టిన బిడ్డకు 'టెట్'​ అని పేరు పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో జరిగింది.

పరీక్ష హాలు నుంచి ఆస్పత్రికి...

నాన్​పుర్​ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలారోజుల క్రితం యూపీ టెట్​కు దరఖాస్తు చేసింది. పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భవతి. ఆదివారం టెట్​కు హాజరయ్యేందుకు గజ్రైలాలోని రమాభాయి అంబేడ్కర్ డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో వెళ్లింది. అయితే.. పరీక్ష రాస్తుండగా సాయంత్రం 4గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఇన్విజిలేటర్ అప్రమత్తమై.. అంబులెన్స్​ను పిలిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు దేవి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. యూపీ టెట్​ పరీక్షకు గుర్తుగా.. ఆ పిల్లవాడికి టెట్ అని పేరు పెట్టారు వైద్య సిబ్బంది.

తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోగేంద్ర సింగ్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:బైక్​ నడుపుతూ మృతి.. రాత్రంతా రోడ్డుపైనే శవం.. వారంతా చూసినా...

Last Updated : Jan 24, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.