UP Election Priyanka Gandhi: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా చేపట్టే 20 లక్షల ఉద్యోగ నియామకాల్లో 40 శాతం మహిళలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 'శక్తి విధాన్' పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో రాష్ట్రంలోని 50 శాతం రేషన్ షాపులను మహిళలే నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆత్మగౌరవం, స్వావలంబన, విద్య, గౌరవం, భద్రత, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణించి ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు.
"రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల ఆధారంగా మహిళలకు కొత్తగా ఇచ్చే ఉద్యోగాల్లో 40 శాతం కేటాయిస్తాము. రాష్ట్ర కార్మిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఉద్యోగుల సదుపాయాలను పర్యవేక్షిస్తాము. వీటితో పాటు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) కింద వచ్చే ఉపాధిలో కూడా 40 శాతాన్ని మహిళలకే కేటాయిస్తాము. మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించే సంస్థలకు పన్ను మినహాయింపు సహా ప్రోత్సాహకాలు ఇస్తాము."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
రాష్ట్రంలో మహిళకు సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు ప్రియాంక గాంధీ.
ఎన్నికల్లో 40 శాతం టికెట్లను మహిళలకే కేటాస్తామని కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రకటించింది.
ఇదీ చూడండి : కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్- సీడీఎస్ రావత్ పరిస్థితిపై ఆందోళన