UP Election Phase 1: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తర్‌ప్రదేశ్ తొలి విడత పోలింగ్‌తో తెరలేచింది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
మొత్తం 623 అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.27 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ముఖ్యంగా జాట్ వర్గానికి చెందిన ఓటర్లు.. ప్రభావం చూపించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ప్రధాన పాత్ర పోషించింది.
ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
మోదీ ట్వీట్..
ఎన్నికల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లంతా ఉత్సాహంగా ఎన్నికల పండగలో భాగం కావాలని కోరారు.
2017 ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని 58 స్థానాల్లో.. భాజపా 53 చోట్ల గెలుపొందింది.
రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చూడండి: 'బికినీ, జీన్స్, హిజాబ్.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'
అటల్ సొరంగానికి ప్రపంచ రికార్డ్- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు