ETV Bharat / bharat

యూపీ ఎన్నికల్లో 'సమాజ్​వాదీ'కి టికాయిత్​ మద్దతు - ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీకి మద్దతు ప్రకటించారు భారతీయ కిసాన్ యూనియన్​ అధ్యక్షుడు నరేశ్​ టికాయిత్​. ప్రజలు సైతం ఈ కూటమికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

samajwadi party
సమాజ్​వాదీ పార్టీకి టికాయిత్​ మద్దతు
author img

By

Published : Jan 16, 2022, 5:56 PM IST

UP Election 2022: ఉత్తరప్రదేశ్‌లో భాజపాను గద్దెదించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి చేయూత లభించింది. యూపీ శాసనసభ ఎన్నికల్లో ఎస్​పీ- రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమికి భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత జాతీయ అధ్యక్షుడు నరేశ్​ టికాయిత్​ మద్దతు ప్రకటించారు. ఉత్తర్​ప్రదేశ్‌ ప్రజలు ఈ కూటమికి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఎస్​పీ- ఆర్​ఎల్​డీ కూటమి శనివారం రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న ఏడుగురు అభ్యర్థులూ ఆర్​ఎల్​డీకి చెందిన వారే. ఇందుకు సంబంధించిన వివరాలు ఆల్​ఎల్​డీ సోషల్​ మీడియాలో షేర్​ చేసింది.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నరేశ్​ సోదరుడు రాకేశ్ టికాయిత్‌ నేతృత్వంలో రైతు సంఘాలు దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళన చేశాయి. ఈ ఆందోళనల్లో యూపీ నుంచి విచ్చేసిన రైతులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : గోవా ప్రజలకు కేజ్రీవాల్ వరాలు.. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.