ETV Bharat / bharat

10 రోజులుగా మనవడి మృతదేహంతో బామ్మ.. తడి బట్టతో తుడుస్తూనే.. - యూపీ క్రైమ్ న్యూస్

మనవడిపైన ప్రేమతో మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని పది రోజులుగా ఉంటోంది ఓ బామ్మ. బాలుడు చనిపోయిన విషయం ఎవరికీ చెప్పకుండా బాధను భరిస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్ బరాబంకీలో జరిగింది.

UP Crime News
మనవడి మృతదేహంతో ఐదురోజులుగా ఉన్న బామ్మ
author img

By

Published : Jun 26, 2023, 9:06 PM IST

మనవడిపై ఉన్న అమితమైన ప్రేమతో అతడు చనిపోయిన విషయం సైతం ఎవరికీ చెప్పకుండా.. పది రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంది ఓ బామ్మ. మనవడు చనిపోయాక అతడిని వదిలి ఉండలేని ఆ వృద్ధురాలు.. ఏడుస్తూ మృతదేహాన్ని తడి బట్టతో తుడుస్తూ తన ప్రేమను చాటుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బరాబంకీలో వెలుగు చూసింది. అయితే మృతదేహం కుళ్లిపోయి.. దుర్వాసన రావడం వల్ల ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఈ విషయం బయటపడింది.

ఇదీ జరిగింది..
మౌహరియ న్యూ కాలనీలోని ఓ ఇంటిలో గత రెండు రోజులుగా దుర్వాసన వస్తోందని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా.. ఓ వృద్ధురాలు వారిని అడ్డుకుంది. చాలా సేపటి తర్వాత డోర్ తీసేందుకు ఆమె అంగీకరించింది. లోపలికి ప్రవేశించిన పోలీసులు బెడ్​పై నిర్జీవంగా పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసి షాక్​కు గురయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు బృందం అక్కడకు చేరుకొని ఆధారాలు సేకరించారు. అయితే వృద్ధురాలు ఎవరితోనూ మాట్లాడేది కాదని.. నిత్యవసరాలు తానే తెచ్చుకునేదని.. తన మనవడిని కూడా బయటకు పంపేది కాదని చుట్టుపక్కల మహిళలు పోలీసులకు చెప్పారు.

up crime news
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

"చనిపోయిన బాలుడిని ప్రియాన్షుగా (17) గుర్తించాం. ప్రియాన్షు గత పది సంవత్సరాలుగా తన బామ్మతోనే ఉంటున్నాడు. అయితే వృద్ధురాలి మానసిక స్థితి సరిగ్గా లేదు. బాలుడు చనిపోయి పది రోజులు అవుతోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే ప్రియాన్షు ఎలా చనిపోయాడన్నది తెలుస్తుంది.దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం"

- సంజయ్ మౌర్య, నగర పోలీసు అధికారి.

"ప్రియాన్షు తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటి నుంచి ప్రియాన్షు మా అమ్మ దగ్గర పెరుగుతున్నాడు. మా నాన్న సత్యనారాయణ ఆర్​పీఎఫ్​ ఉద్యోగి. ఆయన కొన్నేళ్ల కిందట మరణించాడు. ఆయన చనిపోయాక ఇంట్లో మా అమ్మ, ప్రియాన్షు ఇద్దరే ఉంటున్నారు. అయితే మేము నలుగురు తోబుట్టువులం. ప్రియాన్షు అమ్మ నా సోదరి. మా ఇద్దరు సోదరులు చాలా కాలం కిందట చెప్పకుండా వెళ్లిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ మతిస్థిమితం కోల్పోయింది. అందుకే మా అమ్మ ప్రియాన్షును కూడా బయటకు వదిలేది కాదు" అని ప్రియాన్షు పిన్ని మమత పోలీసులకు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.