ETV Bharat / bharat

కాంగ్రెస్​కు నేతల మొండిచెయ్యి.. టికెట్ ఇచ్చినా పార్టీ నుంచి జంప్! - ఉత్తర్​ప్రదేశ్ కాంగ్రెస్ న్యూస్

UP Assembly polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ టికెట్ లభించినా పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరారు. అందులో ఒకరు తన తప్పు గ్రహించి కాంగ్రెస్​లోకి తిరిగి వచ్చారు.

UP Assembly polls 2022
UP Assembly polls 2022
author img

By

Published : Jan 24, 2022, 11:23 AM IST

UP Assembly polls 2022: ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అన్ని పార్టీలు ఖరారు చేస్తున్న నేపథ్యంలో.. టికెట్ దక్కని ఆశావాహులు తదుపరి కార్యాచరణలో నిమగ్నమయ్యారు. అయితే టికెట్ లభించినా.. కొంతమంది పార్టీని వీడి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ సెగ తగిలింది.

UP Assembly polls congress

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో యూసుఫ్ అలీ, హైదర్ అలీ, సుప్రియా ఆరోన్​కు చోటు దక్కింది. పార్టీ తరఫున ప్రచారం ముమ్మరం చేయాల్సింది పోయి.. వీరంతా కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యారు. దీంతో కంగుతినడం కాంగ్రెస్ అధిష్ఠానం వంతైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ ఘటన అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Congress UP polls candidates list

బరేలీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కించుకున్న సుప్రియ.. ఆ తర్వాత సమాజ్​వాదీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, హైదర్ అలీ అప్నాదళ్(ఎస్)లో చేరారు. కాంగ్రెస్ టికెట్​పై పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, అందుకే వీరిద్దరూ ఇతర పార్టీల్లో చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పార్టీ మారి.. మళ్లీ తిరిగొచ్చి..

అయితే, యుసుఫ్ అలీ.. పార్టీ మారిన కొద్ది గంటల్లోనే తిరిగి హస్తం గూటికి వచ్చేశారు. తొలుత ఆయనకు కాంగ్రెస్.. రాంపుర్ జిల్లాలోని చమరువా నియోజకవర్గ టికెట్ ఇచ్చింది. అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత యుసుఫ్ అలీ.. సమాజ్​వాదీ పార్టీలోకి వెళ్లారు. అయితే, ఆ పార్టీలోకి వెళ్లిన యుసుఫ్​కు.. భంగపాటు తప్పలేదు. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎస్పీ అవకాశం ఇవ్వలేదు. దీంతో క్షమించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని వేడుకుంటూ.. తిరిగి హస్తం పార్టీలోకి వచ్చేశారు. కాంగ్రెస్ సైతం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ టికెట్​ను సైతం అలాగే ఉంచింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శక్తి మేర కృషి చేస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి వికాస్ శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మెరుగ్గా రాణించి అధికారం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమం గురించి పట్టించుకోని నేతలే పార్టీని వీడుతున్నారన్నారు. ఇలాంటి నాయకుల్ని ప్రజలు గెలిపించరని జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి: ఎన్నికల ఖర్చులో తగ్గేదేలే.. 5 రాష్ట్రాల్లో రూ.3500 కోట్ల వ్యయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.