ETV Bharat / bharat

యూపీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతం.. 57.79% పోలింగ్

UP assembly election 1st phase: ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ అధికారులు ప్రకటించారు.

UP assembly election 1st phase
యూపీ తొలి విడత పోలింగ్ ప్రశాంతం
author img

By

Published : Feb 10, 2022, 6:04 PM IST

Updated : Feb 10, 2022, 6:43 PM IST

UP assembly election 1st phase: సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్​గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తర్​ప్రదేశ్​లోని 58 స్థానాలకు జరిగిన ఈ విడత పోలింగ్​లో ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

UP assembly election 1st phase
బారులు తీరిన ఓటర్లు
UP assembly election 1st phase
ఓటేసేందుకు లైన్లో నిల్చున్న ప్రజలు

UP polling 1st phase:

ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చాలా చోట్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు. ఖైరానా అసెంబ్లీ నియోజకవర్గంలోని దుందుఖేడాలో పేద ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్న సమాజ్​వాదీ పార్టీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్​ను ఆదేశించినట్లు తెలిపారు.

UP assembly election 1st phase
మంచు కురుస్తున్నా తగ్గేదే లే
UP assembly election 1st phase
ఓటర్ల శరీర ఉష్ణోగ్రత కొలుస్తున్న సిబ్బంది

'కావాలనే నెమ్మదిగా పోలింగ్'

మరోవైపు, ఏ నియోజకవర్గాల్లో ఈవీఎంలు పనిచేయలేదో గుర్తించి చర్యలు తీసుకోవాలన్ని ఎన్నికల సంఘాన్ని కోరారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. పోలింగ్​ను కావాలని నెమ్మదిగా సాగేలా చేశారని ఆరోపించారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. పారదర్శక ఓటింగ్ జరిగేలా చూడటం ఈసీ అతిపెద్ద బాధ్యత అని ట్వీట్ చేశారు.

UP assembly election 1st phase
పోలింగ్ బూత్
UP assembly election 1st phase
ధ్రువపత్రాలు తనిఖీ చేస్తున్న సిబ్బంది

పెళ్లి దుస్తుల్లో వచ్చి...

ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చార్ ఖంబా పోలింగ్ స్టేషన్​లో బలరాం అనే వ్యక్తి వివాహ దుస్తుల్లో వచ్చి ఓటేశారు. పెళ్లి వేడుకలో భాగంగా జాట్ వర్గం ప్రజలు నిర్వహించుకునే 'గూడ్​చాది కార్యక్రమం' పూర్తి చేసుకున్న బలరాం.. ద్విచక్ర వాహనంపై వచ్చి ఓటు వేశారు.

UP assembly election 1st phase
పెళ్లి దుస్తుల్లో బలరాం

బరిలో ఉన్న కీలక నేతలు

మొత్తంగా 623 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గార్గ్, చౌధురి లక్ష్మీ నరైన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్ జరిగింది.

UP assembly election 1st phase
గోటికి సిరా చుక్క
UP assembly election 1st phase
సిరా గుర్తును చూపిస్తున్న ఓటర్లు

గత ఎన్నికల్లో ఎవరిది పైచేయి?

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 58 సీట్లలో 53 భాజపా గెలుచుకుంది. సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు రెండేసి స్థానాలు కైవసం చేసుకున్నాయి. రాష్ట్రీయ లోక్​ దళ్ ఒక సీటుతో సరిపెట్టుకుంది.

UP assembly election 1st phase
భద్రతా దళాల వద్ద ఉండే తుపాకీ

ఇదీ చదవండి: 'అల్లర్లు వద్దనుకుంటే భాజపా అధికారంలోనే ఉండాలి'

Last Updated : Feb 10, 2022, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.