ETV Bharat / bharat

యూపీ కేసులో బిగుస్తున్న ఉచ్చు-ట్విట్టర్​ ఎండీకి నోటీసులు - మనీష్ మహేశ్వరికి ఘజియాబాద్ పోలీసులు నోటీసులు

ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీలోని గాజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్​ను ఉపయోగించుకున్నారని తెలిపారు. యూపీ కేసుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

notice to Twitter India MD
ట్విట్టర్​
author img

By

Published : Jun 18, 2021, 1:04 PM IST

ఓ మతానికి చెందిన వృద్ధుడిపై దాడి చేసిన కేసులో దర్యాప్తుకు హాజరుకావాలని ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 5వ తేదీన 'జై శ్రీరామ్​' అని పలకాలని ఓ వ్యక్తిపై దాడి చేసిన వీడియోను కాంగ్రెస్​ నాయకులు, పలువురు పాత్రికేయులు, ది వైర్​ అనే వెబ్​సైట్​ మతపరమైన ఘర్షణలు సృష్టించాలనే ఉద్దేశంతో షేర్​ చేశారని నోటీసుల్లో తెలిపారు.

సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్​ను ఉపయోగించుకున్నారన్న పోలీసులు... ట్విట్టర్​ సంస్థగానీ, భారత్‌లోని దాని విభాగంగానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్‌గా మారేందుకు ఆస్కారం ఏర్పడిందని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు- యూపీలో​ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.