ETV Bharat / bharat

'తాలిబన్లపై విమర్శ' ​- పోర్న్ సైట్లలో ఆ మహిళ ఫోన్​ నంబర్​! - మహిళలపై తాలిబన్లు ఏ విధమైన శిక్షలు విధిస్తారు?

తాలిబన్లను విమర్శించిదన్న కారణంతో ఓ సామాజిక కార్యకర్త ఫోన్​ నంబర్​ను పోర్న్ సైట్లలో పెట్టారు దుండగులు. దీంతో ఆమెకు ఫోన్​ కాల్స్, మెసేజ్​లు రావడం ప్రారంభమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ.

Taliban
'తాలిబన్లపై విమర్శ' ​- పోర్న్ సైట్లలో ఆ మహిళ ఫోన్​ నంబర్​!
author img

By

Published : Nov 19, 2021, 2:21 PM IST

Updated : Nov 19, 2021, 2:56 PM IST

సామాజిక మాధ్యమాల వేదికగా తాలిబన్లను విమర్శించిందన్న కారణంతో.. ఆగ్రహించిన కొందరు దుండగులు ఓ మహిళ మొబైల్​ నంబర్‌ను పోర్న్ సైట్‌లలో పెట్టారు. దీంతో ఆ మహిళ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది.

ఇదీ జరిగింది..

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎన్​జీఓను నడుపుతున్న సామాజిక కార్యకర్తకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరమైన ఫోన్లు, మెసేజ్​లు విపరీతంగా వస్తున్నాయి. తన నంబర్​ పోర్న్ సైట్లలో ఉందనే.. విషయం తెలుసుకున్న ఆమె గాజీపుర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఎన్జీఓ ప్రమోషన్ కోసం నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో ఉంచినట్లు తెలిపింది.

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన క్రమంలో.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్​ చేసింది బాధిత మహిళ. దానిపై కొందరు అభ్యంతరకరమైన కామెంట్లు చేసినట్లు పోలీసులకు తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 19, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.