ETV Bharat / bharat

'లాక్​డౌన్​ కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయ్'​ - కాంగ్రెస్

ప్రణాళిక లేకుండా కేంద్రం విధించిన లాక్​ డౌన్​ వల్ల ఎదురైన కష్టాలు ఇప్పటికీ దేశ ప్రజల్ని వెంటాడుతున్నాయని కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ విమర్శించారు. దీనంతటికి కేంద్రం అసమర్థతే కారణమని మండిపడ్డారు.

Unplanned lockdown disaster continues to haunt country:Rahul Gandhi
'లాక్​డౌన్​ కష్టాలు ఇంకా వెంటాడుతన్నాయ్'​
author img

By

Published : Mar 19, 2021, 1:34 PM IST

Updated : Mar 19, 2021, 1:50 PM IST

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఎదురైన కష్టాలు దేశ ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దూరదృష్టి లోపం, అసమర్ధత వల్ల లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయా కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు రాహుల్ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. కరోనా కారణంగా శిశువులు, గర్భిణుల మరణాలు ఆసియాలోని ఆరు ప్రఖ్యాత దేశాల్లో కంటే భారత్‌లోనే ఎక్కువ నమోదు కానున్నాయని యునిసెఫ్‌ వెల్లడించిన నివేదికపైనా రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'జిన్నా మార్గంలో రాహుల్ గాంధీ అడుగులు'​

Last Updated : Mar 19, 2021, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.