ఇద్దరు యువతులు ఒకే మండపంలో ఓ యువకుడిని వివాహం చేసుకున్నారు. ముగ్గురు కలిసి ఏడడుగులు వేశారు. ఝార్ఖండ్‌లోని లోహర్దగాలో (Lohardaga Jharkhand) జరిగిందీ ఘటన.
'అలా మొదలైంది'
జిల్లాలోని(Lohardaga news) హిస్రి పంచాయతీ జోగియారా గడ్తోలీకి చెందిన సంజీత్ ఉరావ్.. అరేయా పంచాయతీకి చెందిన రింకి ఉరాన్తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు సంతానం.
అయితే, కొద్దిరోజుల క్రితం హిస్రి పంచాయతీకి చెందిన కళావతితో 'ప్రేమ'లో పడ్డాడు ఉరావ్. తర్వాత ఈ విషయం ఇద్దరు యువతులకు తెలిసిపోయింది. 'నిన్నే పెళ్లాడతా' అంటూ యువకుడితో ఇద్దరు యువతులు తెగేసి చెప్పారు. సంజీత్ సైతం అందుకు అంగీకరించాడు. చివరకు ముగ్గురు కలిసి తమ తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఒప్పించారు. (Lohardaga news)
మూడు కుటుంబాల ఆమోదంతో వీరు ముగ్గురూ ఒకే మండపంలో వివాహం చేసుకున్నారు. పైపర్ టోంగ్రి శివధామంలో వీరి పెళ్లి జరిగింది. ఈ ప్రత్యేకమైన వివాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలి వచ్చారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అంతా 'ఖుషీ'
వివాహం పట్ల ముగ్గురూ సంతోషంగా ఉన్నారు. వీరి ఆనందం ఏ స్థాయిలో ఉందంటే.. ఏడడుగులు వేసే సమయంలో సంతోషంతో మధ్యలోనే ఆగిపోయారు. ముచ్చటపడుతూ మూడడుగులు వేయగానే నిలిచిపోయారు. పక్కన ఉన్నవారు వారించేసరికి మిగిలిన నాలుగడుగులు పూర్తి చేశారు.
వీరి వివాహంపై స్థానికులు భిన్నంగా మాట్లాడుకుంటున్నారు. వీరి భవిష్యత్ ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: ప్రియాంక 'గాంధీగిరి'.. హౌస్ అరెస్ట్ వేళ చీపురు పట్టి...