జవాన్లతో షా సమావేశం
ఛత్తీస్గఢ్ బీజాపుర్లోని సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద జవాన్లతో హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.
జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడన్నారు షా. మావోయిస్టు సమస్య వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. లోంగిపోవాలనుకునే వారు జనజీవన స్రవంతిలోకి వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు.
మావోయిస్టులపై పోరులో జవాన్లకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.