ETV Bharat / bharat

వ్యాక్సినేషన్ 3.0పై కేంద్రం కీలక మార్గదర్శకాలు

కరోనా టీకా ధరలను కొవిన్ పోర్టల్​లో అందుబాటులో ఉంచుతామని కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 28 నుంచి 18-45 ఏళ్ల వయసు వారికి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్న ప్రైవేటు సెంటర్లన్నీ.. కరోనా టీకా రకం, వాటి నిల్వలు, ధరను కొవిన్ పోర్టల్​లో తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేసింది.

Union health secy writes to states, UTs on phase 3 inoculation drive
వ్యాక్సినేషన్ 3.0పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
author img

By

Published : Apr 25, 2021, 6:27 PM IST

మే 1 నుంచి కరోనా టీకాల ధరలను కొవిన్ పోర్టల్​లో అందుబాటులో ఉంచుతామని కేంద్రం వెల్లడించింది. ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు.. టీకాను ఎంచుకునే సౌలభ్యం ఉంటుదని తెలిపింది.

18-44 ఏళ్ల వయసు వారికి ఏప్రిల్ 28 నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్న ప్రైవేటు సెంటర్లన్నీ.. కరోనా టీకా రకం, వాటి నిల్వలు, కేంద్రం నిర్ణయించిన ప్రకారం వాటి ధరను కొవిన్ పోర్టల్​లో తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు. ఈ వివరాలను జత చేసేందుకు పోర్టల్​లో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.

"కొవిన్ మాడ్యూల్​లో టీకా ధర, రకం వంటి వివరాలను పొందుపరుస్తాం. తద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్​మెంట్ సమయంలో పౌరులు తమ టీకాను ఎంపిక చేసుకోవచ్చు"

- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.

ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే ప్రైవేటు కేంద్రాల్లో టీకా లభిస్తుందని రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. ప్రాధాన్య జాబితాలో ఉన్నవారికి ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితంగానే అందుతుందని చెప్పారు. 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి ప్రైవేటు కేంద్రాల్లో టీకా అందిస్తారని పేర్కొన్నారు. 'ఆయా రాష్ట్రాల్లో అనుమతించిన ప్రకారం 45 ఏళ్ల లోపు పౌరులు ప్రభుత్వ కేంద్రాల్లో టీకా పొందేందుకు అర్హులే. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు టీకా తయారీదారుల వద్ద సేకరించిన డోసుల నుంచి ఈ అదనపు లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందుతుంది' అని లేఖలో వివరించారు.

ఇదీ చదవండి- టీకా కోసం వారికి​ రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.