ETV Bharat / bharat

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం.. నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక

Union government key decision on Polavaram project

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 8:43 PM IST

Updated : Aug 29, 2023, 9:06 PM IST

20:31 August 29

నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక

Union Government Key Decision on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబందిచి నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జలశక్తిశాఖ నిర్ణయించిది. పోలవరంపై అంతర్గత సమీక్షలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. యాక్షన్‌ ప్లాన్‌ మేరకు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జలశక్తిశాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్‌కు యాక్షన్ ప్లాన్ తయారీకి బాధ్యత అప్పగించారు. డయాఫ్రం వాల్, గైడ్ బండ్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థతో కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించనట్లు తెలుస్తోంది. తద్వారా ప్రాజెక్టు వద్ద లోటుపాట్లు బయటపడే అవకాశం ఉన్నట్లు కేంద్రం భావిస్తోంది.

అప్పర్ కాపర్‌డాం, లోయర్‌ కాపర్‌డాంల నుంచి నీటి లీకేజీ నష్టంపై జలశక్తి శాఖ అధికారులు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని నిర్దేశించినట్లు సమాచారం. డయాఫ్రం వాల్, గైడ్ బండ్‌ సహా మొత్తం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ మధ్య సమన్వయ లోపాలు ఉన్నాయన్న పరిగణిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. మిగిలిన శాఖల మధ్య ఉన్న లోపాలను సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ కార్యాచరణ సిద్ధం చేయాలని జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించినట్లు సమాచారం.

Last Updated : Aug 29, 2023, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.