ETV Bharat / bharat

'100శాతం మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్​లో క్లియర్​ రోడ్​మ్యాప్​​' - Impact of Union Budget 2022-23 on Rural Development

Union Budget 2022-23: దేశంలో మౌలిక వసతుల పథకాల లక్ష్యాన్ని 100 శాతం సాధించేందుకు సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందుకు వార్షిక బడ్జెట్​ 2022-23లో కేంద్రం స్పష్టమైన మార్గనిర్దేశం చేసినట్లు చెప్పారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Feb 23, 2022, 12:27 PM IST

Union Budget 2022-23: దేశ ప్రజలకు నీరు, విద్యుత్తు, గ్యాస్​ కనెక్షన్​, మరుగుదొడ్లు, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పనలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందుకు వార్షిక బడ్జెట్​ 2022-23 మార్గనిర్దేశం చేస్తుందని నొక్కిచెప్పారు. 'గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్​ 2022-23 సానుకూల ప్రభావం'పై నిర్వహించిన వెబినార్​లో​ మాట్లాడారు మోదీ. గడిచిన ఏడేళ్లలో ప్రతి ఒక వ్యక్తి, సెక్టార్​ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

"గ్రామాలు, పేద ప్రజలకు ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్​, విద్యుత్తు కనెక్షన్లు, నీళ్లు, రోడ్ల వంటి మౌలిక వసతులు కల్పించటమే ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశం. దేశం ఈ పథకాల్లో గొప్ప విజయాన్ని సాధించింది. అయితే, ఈ పథకాల లక్ష్యాన్ని 100 శాతానికి చేర్చేందుకు సమయం ఆసన్నమైంది. అందుకు, పథకాల పర్యవేక్షణ, జవాబుదారీ కోసం సరికొత్త వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. సాంకేతికత సాయంతో, కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ దానిని సాధించాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు బడ్జెట్​ ద్వారా స్పష్టమైన రోడ్​మ్యాప్​ను ప్రభుత్వం అందించింది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

పీఎం హౌసింగ్​, గ్రామీణ రహదారులు, జల్​ జీవన్​ మిషన్​, ఈశాన్య అనుసంధానత, గ్రామాలకు బ్రాడ్​బాండ్​ కనెక్టివిటీ వంటి వాటికి అవసరమైన నిబంధనలను ఈ బడ్జెట్​లో పొందుపరిచినట్లు చెప్పారు మోదీ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో కీలకంగా మారనుందన్నారు.'సబ్కా సాత్​, సబ్కా వికాస్​.. సబ్కా విశ్వాస్​, సబ్కా ప్రయాస్​' అనేది ప్రభుత్వ విధానాలు, పనుల వెనుకున్న ఛోదకశక్తిగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చిన్నారిపై పిన్ని కర్కశం.. చేతులు విరగ్గొట్టి.. ముఖంపై దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.