ETV Bharat / bharat

15 ప్యూన్​, వాచ్​మ్యాన్​ ఉద్యోగాలు.. దరఖాస్తులు 11 వేలు! - Unemployment

Pune jobs applications: ఉద్యోగ నియామకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఇందులో ప్యూన్లు, డ్రైవర్లు, వాచ్‌మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 15 పోస్టులుండగా.. ఏకంగా 11 వేల దరఖాస్తులు వచ్చాయి. పదో తరగతి విద్యార్హత కాగా.. ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పీహెచ్​డీ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం.

11,000 Applicants For 15 Jobs
11,000 Applicants For 15 Jobs
author img

By

Published : Dec 29, 2021, 2:34 PM IST

Updated : Dec 29, 2021, 5:05 PM IST

15 ప్యూన్​, వాచ్​మ్యాన్​ ఉద్యోగాలు

Madhya Pradesh Unemployment: దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో 15 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో ప్యూన్లు(బంట్రోతులు), డ్రైవర్లు, వాచ్​మ్యాన్​ పోస్టులు ఉన్నాయి. అయితే పదులు, వందలు కాదు ఏకంగా 11 వేల మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకొని.. నగరంలో వాలిపోయారు. శని, ఆదివారాల్లో భారీ సంఖ్యలో బారులు తీరారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో.. పొరుగు రాష్ట్రం ఉత్తర్​ ప్రదేశ్​ నుంచి కూడా ఉండటం విశేషం.

ఈ ఉద్యోగాలకు విద్యార్హత పదో తరగతి కాగా.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్​ గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, ఎంబీఏ చేసినవారు, సివిల్​ జడ్జి ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేశారు.

పీహెచ్​డీ చేసినవారు కూడా ఉన్నట్లు అక్కడికి వచ్చిన అభ్యర్థులు చెప్పారు.

''నేను సైన్స్​ గ్రాడ్యుయేట్​ను. ప్యూన్​ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. ఇక్కడ లైన్లలో పీహెచ్​డీ చేసినవారు కూడా ఉన్నారు.''

- అజయ్​ బఘేల్​, ఓ అభ్యర్థి

''నేను డ్రైవర్​ పోస్ట్​ కోసం దరఖాస్తు చేశాను. నేను జడ్జి పరీక్ష కోసం కూడా సిద్ధమవుతున్నాను. నాది మాధవ్​ కాలేజీ. ఒక్కోసారి పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోయేవి. అందుకే.. నాకు ఏదైనా పని కావాలి.''

- జితేంద్ర మౌర్య, లా గ్రాడ్యుయేట్

Madhya pradesh Job Crisis: గణాంకాల ప్రకారం.. మధ్యప్రదేశ్​లో 32,57,136 మంది నిరుద్యోగులు ఉన్నారు. రాష్ట్ర విద్యాశాఖలో 30,600, హోం శాఖలో 9388, ఆరోగ్య శాఖలో 8,592, రెవెన్యూ శాఖలో 9530 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి అన్ని విభాగాల్లో లక్షకుపైనే ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​పై విమర్శలు గుప్పిస్తున్నారు అభ్యర్థులు. ఇటీవల ప్రతి సంవత్సరం లక్ష మందిని నియమించుకుంటామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. ఉద్యోగ ప్రకటన ఏమైందని విరుచుకుపడుతున్నారు.

ఇవీ చూడండి: యూపీలో మారిన పొత్తుల సరళి.. చిన్న పార్టీలతోనే దోస్తీ ఎందుకంటే?

కంప్యూటర్లతో మాట్లాడే 'మాధవ్‌'- వండర్‌ బాయ్‌ ఆవిష్కరణ

Last Updated : Dec 29, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.