ETV Bharat / bharat

'ప్రపంచ సమస్యలపై సంఘటితంగా పనిచేస్తాం '

author img

By

Published : Jun 14, 2021, 9:27 PM IST

అంతర్జాతీయ సమస్యలపై భారత్​తో కలిసి సంఘటితంగా పని చేస్తామని పేర్కొంది బ్రిటన్​. జీ7 సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్​గా పాల్గొనటంపై సంతోషం వ్యక్తం చేశారు భారత్​లో యూకే హైకమిషనర్​ జాన్​ థాంప్సన్​.

UK envoy
భారత్​లో బ్రిటన్​ రాయబారి

ఐరాస పర్యావరణ మార్పులపై సదస్సు(COP26)ను ముందుకు తీసుకెళ్లటం సహా.. వివిధ అంతర్జాతీయ సమస్యలపై భారత్​తో కలిసి సంఘటితంగా పనిచేస్తాని బ్రిటన్​ వెల్లడించింది. జీ-7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు భారత్​లో బ్రిటన్​ తాత్కాలిక హైకమిషనర్​ జాన్​ థాంప్సన్​.

" యూకే ఆతిథ్యంలో నిర్వహించిన జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్​గా హాజరవటం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆరోగ్యం, వాతావరణం, బహిరంగ సమాజం వంటి వాటిపై చేపట్టిన చర్చల్లో పాల్గొన్నారు. భారత్​తో పాటు పాల్గొన్న సభ్యులందరూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడతామని భరోసా కల్పిస్తూ బహిరంగ ప్రకటనపై సంతకం చేశారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయటం, కొవిడ్​-19తో ఏర్పడిన సంక్షోభం ఎప్పుడూ ఎదురవకుండా గట్టి చర్యలు చేపట్టేందుకు జీ7 నేతలు అంగీకరించారు. దానికి మద్దతుగా వచ్చే ఏడాదిలోపు యూకే 100 మిలియన్​ డోసులను అందించనుంది. "

- జాన్​ థాంప్సన్​, భారత్​లో బ్రిటన్​ రాయబారి

వాతవరణ మార్పులు, కాలుష్యం, భూతాపంపై చర్చించేందుకు 'ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పుల సదస్సు-2021' ఈ ఏడాది చివరిలో జరగనుంది. దీనినే కాప్​26 అని పిలుస్తారు. ఈ సదస్సులో భారత్​తో కలిసి పని చేస్తామని తెలిపారు థాంప్సన్​.

జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనటంపై సంతోషం వ్యక్తం చేశారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఈ సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చూడండి: G-7: ప్రపంచానికి బిలియన్​ డోసుల భరోసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.