ETV Bharat / bharat

శిల్పకళా అద్భుతం 'మహాకాల్‌ లోక్‌'.. రూ.856 కోట్లతో అభివృద్ధి - ఉజ్జయిని మహాకాల్​ లోక్​ మోదీ ప్రారంభం

నందుల సుస్వాగతం.. 108 రాజస్థాన్‌ రాతిస్తంభాలు.. జలయంత్రాలు.. 50కు పైగా శివపురాణాన్ని తెలిపే కుడ్యచిత్రాలు.. ఇవన్నీ మనల్ని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళతాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభం కానున్న ఉజ్జయినిలోని 'మహాకాల్‌ లోక్‌' విశేషాలు ఇవి. ఓ సారి ఆ చిత్రాలు, నిర్మాణ వివరాలు తెలుసుకుందాం..

Ujjain Mahakal Lok
Ujjain Mahakal Lok
author img

By

Published : Oct 10, 2022, 7:23 AM IST

Ujjain Mahakal Lok: నందులు స్వాగతం పలుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన రెండు ప్రవేశద్వారాలు.. లోపలికి అడుగు పెట్టగానే వివిధ శిల్పకళాకృతులతో వరుసగా కొలువుదీరినట్టున్న 108 రాజస్థాన్‌ రాతిస్తంభాలు.. నీటిధారలు పైకి చిమ్ముతున్న జలయంత్రాలు.. శివపురాణంలోని వివిధ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపుతున్న 50కు పైగా కుడ్యచిత్రాలు ఆధ్యాత్మిక లోకంలోకి మనల్ని తీసుకువెళతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అక్టోబరు 11న ప్రారంభం కానున్న చారిత్రక నగరం ఉజ్జయినిలోని 'మహాకాల్‌ లోక్‌' విశేషాలు ఇవి.

Ujjain Mahakal Lok
మహాకాల్‌ లోక్‌
Ujjain Mahakal Lok
మహాకాల్‌ లోక్‌

మధ్యప్రదేశ్​లో ఉన్న పురాతన మహాకాళేశ్వర్‌ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌ రాజధాని నగరమైన భోపాల్‌కు ఇది 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం పక్కనే ఉన్న రుద్రసాగర్‌ సరస్సును పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. ఏడాది పొడవునా భక్తుల రాకపోకలు ఉండే మహాకాళేశ్వర్‌ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

మహాకాల్‌ లోక్‌
మహాకాల్‌ లోక్‌
Ujjain Mahakal Lok
మహాకాల్‌ లోక్‌

2017లో ఈ ప్రాజెక్టు మొదలుకాగా.. గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులు నిర్మాణాలను తీర్చిదిద్దారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40-45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. శిప్రా నదీతీరాన వెలసిన ఉజ్జయినికి అవంతిక అనే పురాతన నామధేయం ఉంది. దిగ్గజ పాలకుడు విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.