ETV Bharat / bharat

ఇకపై ఆధార్​ అప్​డేట్ తప్పనిసరి! - ఆధార్ లేటస్ట్ అప్డేట్స్​

పదేళ్లకొకసారి ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది యూఐడీఐఏ. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల వారికి ఈ అప్​డేట్ తప్పనిసరి కాగా ఇదే తరహాలో పెద్దలు కూడా చేసుకోవాలని కోరింది.

uidai-to-encourage-people-to-update-their-aadhaar-biometrics-every-10-years

author img

By

Published : Sep 16, 2022, 6:06 PM IST

Updated : Sep 16, 2022, 7:46 PM IST

Aadhaar Voluntary Update : పదేళ్లకొకసారి వయోజనులు తమ ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ). ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారికి అప్​డేేట్ తప్పనిసరిగా ఉంది. కాగా వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్​ అప్​డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. మేఘాలయ, నాగాలాండ్​ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వయోజనుల ఆధార్​ కార్డులను అప్​డేట్​ చేశామని తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) సమస్య కారణంగా మేఘాలయలో ఈ ప్రక్రియ ఆలస్యంమైందని తెలిపింది. నాగాలాండ్, లద్దాఖ్​లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్డులు మంజూరు చేయాల్సి ఉందని యూఐడీఏఆ సంస్థ పేర్కోంది.

ప్రస్తుతం ఆధార్​ కలిగిన వారి శాతం 93.5 శాతానికి చేరుకుందని.. ఒక్క ఆగస్టు నెలలోనే 24.2 లక్షలమంది కొత్తగా నమోదయ్యారని చెప్పింది. దేశంలో దాదాపు 50,000 ఆధార్​ అప్​డేట్​ కేంద్రాలు ఉన్నాయని.. ఫోన్​ నంబర్, చిరునామాలను అప్​డేట్​ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్​ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. పేపర్​లెస్​ ప్రయాణాలను పేపర్​లెస్​గా చేయాలని లక్ష్యంతో విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన 'డిజియాత్ర' ధ్రువీకరణ కోసం ఆధార్​ను అనుసందానం చేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: డ్యాన్సింగ్​ పోలీస్.. స్టెప్​ వేస్తే క్షణాల్లో ట్రాఫిక్ క్లియర్

పోలీసులకు పాములు రక్ష.. ఆ రైతు ఆలోచన అదుర్స్​!

Last Updated : Sep 16, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.