Two women doctors wedding: మహారాష్ట్ర నాగ్‌పుర్‌కు చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. గతవారమే నిశ్చితార్థం చేసుకున్న వారు.. త్వరలోనే గోవాలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇద్దరి మనసులు కలిశాయని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని.. అందుకే బతికున్నంత వరకు కలిసి ఉండాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ బంధానికి 'లైఫ్‌టైమ్ కమిట్మెంట్' అనే పేరు పెట్టుకున్నారు. ఈ వైద్యురాళ్ల పేర్లు పరోమిత ముఖర్జీ, సురభి మిత్ర.
తన లైంగిక ధోరణి గురించి తండ్రికి 2013 నుంచే తెలుసని ఇద్దరు డాక్టర్లలో ఒకరైన పరోమిత ముఖర్జీ తెలిపారు. అయితే తన తల్లికి ఇటీవలే ఈ విషయం చెబితే షాక్‌కు గురైందని, కానీ తన సంతోషం కోసం ఆ తర్వాత అంగీకరించిందని చెప్పారు.
తన లైంగిక ధోరణి గురించి కూడా కుటుంబ సభ్యులకు ఎప్పటి నుంచో తెలుసని ఈ జంటలో మరో వైద్యురాలు సురభి మిత్ర వెల్లడించారు. ఈ విషయం గురించి వారికి తెలిసినప్పుడు ఎలాంటి ఆందోళనా చెందలేదని పేర్కొన్నారు. మానసిక వైద్యురాలైన తన వద్దకు ఎంతో మంది వచ్చి ద్వంద్వ జీవితం గురించి చెప్పేవారని, ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నామనేవారని వివరించారు.
ఇదీ చదవండి: 'బుల్లీబాయ్ యాప్ కేసు'లో మరొకరు అరెస్ట్.. కేసు 'ఐఎఫ్ఎస్ఓ'కు బదిలీ