ETV Bharat / bharat

Elephants Attack: ఏనుగుల దాడిలో ఇద్దరు.. విద్యుత్​షాక్​తో నాలుగు గజరాజులు మృతి

Elephants Attack: ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందిన ఘటన చిత్తూరి జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ షాక్ గురై నాలుగు ఏనుగులు మృతి చెందాయి.

Elephants Attack
ఏనుగుల దాడి
author img

By

Published : May 12, 2023, 9:00 AM IST

Updated : May 12, 2023, 9:42 PM IST

Elephants Attack: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గజరాజులు దాడి చేయడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ రోజు ఉదయం పైపాలెము, మోత్లచేను, మల్లానూరు గ్రామాలలోని.. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను పరుగులు పెట్టించాయి. మల్లానూరు పంచాయతీ పర్తి చేను గ్రామానికి చెందిన ఉష (42) కాలినడకన రైల్వేస్టేషన్​కు వెళుతుంటే రెండు ఏనుగులు ఆమెపై దాడి చేశాయి. ఈ దాడిలో ఉష మృతి చెందింది.

Elephants Attack: ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి

సప్పానికుంట గ్రామానికి చెందిన రైతు శివలింగం (70) పొలం నుంచి ఇంటికి వెళుతుండగా.. ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో శివలింగం మృతి చెందారు. వారం రోజుల కిందట తమిళనాడులో పెరుమాల్ అనే రైతును బలిగొన్న జంట ఏనుగులను.. అక్కడి అటవీ సిబ్బంది కుప్పం వైపు మళ్లించారు.

గురువారం ఉదయం నుంచి కుప్పం మండలంలో సంచరిస్తున్న ఆ జంట ఏనుగులు.. తాజాగా ఇద్దరిని బలిగొన్నాయి. ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏనుగుల నుంచి రక్షణను కల్పించేందుకు.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏనుగులు జనాన్ని భయపెట్టి పరుగులు పెట్టిస్తున్నాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఏనుగులను అక్కడి నుంచి పొలాల్లోకి తరిమారు. ఘటనా స్థలిలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఏనుగులు మృతి: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ సమీపంలో విద్యుత్ షాక్ గురై ఏనుగులు మృతి చెందాయి. పొలంలోని ట్రాన్స్ ఫార్మర్‌ను తాకి నాలుగు గజరాజులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఏనుగులు కొంటపైకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఆరు నెలల కిందట ఒడిశా నుంచి ఆరు ఏనుగుల గుంపు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.

విద్యుత్​షాక్​తో నాలుగు గజరాజులు మృతి

నిత్యం సంచరించే ప్రదేశాలు అయినా సరే.. ఏనుగులు ఇలా విద్యుదాఘాతంతో మరణించడాన్ని చూసి జంతు ప్రేమికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏనుగుల మృతిపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థాలానికి చేరుకున్న అటవీశాఖ అధికారుల బృందం ఘటనపై విచారణ చేస్తున్నారు. కాగా గతంలోనూ ఇలా విద్యుదాఘాతంతో ఏనుగులు, వివిధ జంతువులు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే.. నేడు నాలుగు ఏనుగులు మృతి చెందాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 12, 2023, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.