ETV Bharat / bharat

ఉత్తరాఖండ్ ఘటనలో 38కి చేరిన మృతులు - uttarakhand floods

ఉత్తరాఖండ్ చమోలీలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. తపోవన్ సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 114 మీటర్ల మేర మట్టిని తొలగించామని అధికారులు తెలిపారు.

two-more-dead-bodies-found-during-rescue-operations-in-chamoli
మరో రెండు మృతదేహాల లభ్యం.. 38కి చేరిన మృతుల సంఖ్య
author img

By

Published : Feb 12, 2021, 8:57 PM IST

ఉత్తరాఖండ్ చమోలీలో మరో రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 38కి చేరింది. ఒక మృతదేహాన్ని రిషి గంగా హైడెల్​ ప్రాజెక్టు శిథిలాల్లో కనుగొనగా, మరో మృతదేహం మైథనా ప్రాంతంలో లభించింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

two-more-dead-bodies-found-during-rescue-operations-in-chamoli
కొనసాగుతున్న సహాయక చర్యలు

వరదల ప్రభావానికి తెగిపోయిన వంతెనల స్థానంలో సైన్యం తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేసింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన సుకీ, లతా, భల్​గావ్​ గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరకులను అందిస్తోంది.

తపోవన్​లో కొనసాగుతున్న చర్యలు..

తపోవన్​ సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. డ్రిల్లింగ్​ యంత్రం పాడవడం మూలాన గురవారం ఆగిపోయిన పనులను కొత్త యంత్రాల సాయంతో వేగవంతం చేశామని అధికారులు తెలిపారు.పైనున్న టన్నెల్‌ నుంచి కింది టన్నెల్‌కు వెళ్లేందుకు..డ్రిల్లింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 114 మీటర్ల మేర మట్టిని తొలగించామని తెలిపారు.

సొరంగంలో 180 మీటర్ల తర్వాత మలుపు ఉన్నందున అక్కడ ఎవరైనా ఉండొచ్చనే ఆశతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిషి గంగా వద్ద ఏర్పడిన సరస్సును సమీక్షించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని పంపామని తెలిపారు.

కాఫర్ డ్యామ్..

డ్రిల్లింగ్​తో పాటు సమీపంలోని గౌరీ శంకర్ ఆలయం వద్ద రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని తవ్వక యంత్రాలను రప్పించేందుకు వీలుగా ఈ నిర్మాణం చేపడుతున్నారు. సొరంగంలోకి ఎలాంటి నీరు వెళ్లకుండా ఉండేందుకు కాఫర్​ డ్యామ్​ను నిర్మిస్తున్నారు.

రంగంలోకి ఎన్​టీపీసీ..

వరద బాధితులకు వైద్య సహాయం అందించనున్నామని ఎన్​టీపీసీ శుక్రవారం ప్రకటించింది. అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్​ క్యాంప్​లు నిర్వహిస్తామని తెలిపింది. ఎన్​టీపీసీ యాజమాన్యం జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల సహకారం అందిస్తోందని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ఆటంకం తర్వాత మళ్లీ మొదలైన సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.