Two Men Rape a Woman: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. భింద్ జిల్లాలో ఓ మహిళపై (24) ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి మూడేళ్ల కుమారున్ని చంపేస్తామని తుపాకీతో బెదిరించి ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని మెహగావ్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
నిందితులు విక్రమ్(28), కృష్ణ శర్మ(30) తన కుమారునిపై తుపాకీ ఎక్కుపెట్టి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
చాక్లెట్ ఆశచూపి..
మధ్యప్రేదేశ్, గ్వాలియర్‌లో అమానవీయ ఘటన జరిగింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుకాణాదారుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చాక్లెట్ కోసం దుకాణానికి వచ్చిన బాలికను చాక్లెట్ల ఆశ చూపి షాప్కీపర్ లోబరుచుకున్నాడు. అనంతరం సమీపంలోని గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. షాప్‌కు వెళ్లి చాలాసేపటివరకు బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకసాగారు. ఈ క్రమంలో బాలిక ఓ చోట ఏడుస్తూ కనిపించింది. అసలు విషయం వెల్లడించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: సిగరెట్ తాగాడని.. గొంతు కోసి.. మృతదేహాన్ని బ్యాగులో కుక్కి..