ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన బాలికల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు వినయ్ అనే యువకుడు కాగా.. మరో మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురు బాలికలు పొలంలో అపస్మారక స్థితిలో కనిపించినట్లు తెలిపిన పోలీసులు... నిందితులు వారికి పురుగుల మందు ఇచ్చినట్లు తెలిపారు. వారిలో చనిపోయిన ఇద్దరి అంత్యక్రియలు భారీ భద్రత మధ్య జరిగినట్లు పేర్కొన్నారు.
నిందితుల పై ఐపీసీ సెక్షన్ 302, 201 కింద కేసు నమోదు చేశారు. బాధితుల తండ్రి నుంచి వాగ్మూలం నమోదు చేశారు.
ఇవీ చూడండి: