ఉత్తర్‌ప్రదేశ్ ఇతౌంజలో.. బిందేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లోని అమోనియా ప్లాంట్‌లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులను వెంటనే లఖ్‌నవూలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇరుక్కుపోయినవారిని రక్షించినట్లు తెలిపారు. మృతులను ధర్మేంద్ర, మిశ్రాల్గా గుర్తించినట్టు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కోర్టు ఆదేశించినా.. నిందితుడిని వదిలేసిన పోలీసులు