ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు(up congress news) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు కీలకమైన సీనియర్ నేతలు(up congress leaders) తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఉత్తర బంగాల్లోని సిలిగుడి పర్యటనలో ఉన్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో కాంగ్రెస్ నేతలు రాజేశ్పతి త్రిపాఠి, లలితేశ్పతి త్రిపాఠి.. టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(mamata banerjee news) నేతృత్వంలో.. యూపీ సహా కేంద్రంలో భాజపాను గద్దె దించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
![leaders from Congress join Trinamool Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/_25102021164141_2510f_1635160301_259_2510newsroom_1635160929_829.jpg)
రాజేశ్పతి త్రిపాఠి ఎమ్మెల్సీగా సేవలందించగా.. లలితేశ్పతి త్రిపాఠి యూపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఓసారి ఎమ్మెల్యేగానూ చేశారు. వీరు ఇరువురు యూపీ మాజీ ముఖ్యమంత్రి కమలాపతి త్రిపాఠి మనవళ్లు.
కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ(mamata banerjee news). 'టీఎంసీపై విశ్వాసం పెరుగుతోంది. ఇద్దరు కాంగ్రెస్ నేతల చేరికతో భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేయగల అఖిల భారత పార్టీగా నిరూపితమవుతోంది.' అని పేర్కొన్నారు.
ఎస్పీలోకి ఇద్దరు బీఎస్పీ బహిష్కృత నేతలు
మరోవైపు.. సమాజ్వాదీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు బీఎస్పీ మాజీ నేతలు లాల్జీ వర్మ, రామాచల్ రాజ్భర్. నవంబర్ 7న అంబేడ్కర్ నగర్ జిల్లాలో జరిగే ఎస్పీ ర్యాలీ వేదికగా ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో చేరతామని స్పష్టం చేశారు.
కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా వారిని జూన్ 3న పార్టీ నుంచి బహిష్కరించారు మాయావతి. బీఎస్పీ హయాంలో వారు మంత్రులుగా సేవలందించారు.
ఇదీ చూడండి: ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో నయా రాజకీయం!