ETV Bharat / bharat

12 ఏళ్లకే 'టోఫెల్'​ ఉత్తీర్ణత- కశ్మీర్​ బాలిక ఘనత

జమ్ముకశ్మీర్​కు చెందిన జైనాబ్​ మసూమా అనే 12 ఏళ్ల బాలిక.. టోఫెల్​ పరీక్షలో 120కి 115 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన వయసు వారెవ్వరూ సాధించని ఘనతను జైనాబ్​ సొంతం చేసుకుంది. సాధారణంగా ఈ పరీక్ష విశ్వవిద్యాలయ స్థాయి వారికే కఠినంగా ఉంటుంది.

author img

By

Published : May 30, 2021, 1:47 PM IST

Zainab
జైనాబ్​ మసూమా

తన వయసులో ఎవరూ సాధించలేని ఘనతను 12 ఏళ్ల బాలిక సొంతం చేసుకుంది. విశ్వవిద్యాలయ స్థాయి వారికే కఠినమైన పరీక్షలో అలవోకగా ఉత్తీర్ణురాలైంది.

ఇంతకీ కథేంటంటే..

Zainab
జైనాబ్​ మసూమా

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని షాలిమార్​కు చెందిన ఆ బాలిక పేరు జైనాబ్​ మసూమా. ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇంగ్లీష్​ భాషా సామర్థ్యాన్ని పరీక్షించే అంతర్జాతీయ ఆంగ్ల పోటీ పరీక్ష.. టోఫెల్​(టీఓఈఎఫ్​ఎల్​)లో 120 పాయింట్లకు 115పాయింట్లు పొంది అందరినీ అబ్బురపరిచింది.

Zainab marks in TOEFL
టోఫెల్​ పరీక్షలో 120కి 115 మార్కులు సాధించిన జైనాబ్​
Zainab mother
జైనాబ్​ తల్లి
Zainab father
జైనాబ్​ తండ్రి

"ఇది నిజంగా పెద్ద విజయం. మాకు చాలా సంతోషంగా ఉంది. జైనాబ్ మాదిరిగా లోయలో చాలా మంది పిల్లలు ఉన్నారు. వారికి సరైన సంరక్షణ, మార్గదర్శకత్వం ఇస్తే కశ్మీర్‌ను ప్రపంచవ్యాప్తంగా గర్వించేలా చేస్తారు."

-జైనాబ్​ తల్లిదండ్రులు

టోఫెల్​ పరీక్షను ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో 11 వేల విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తాయి. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ స్థాయి ఇంగ్లీష్​ సామర్థ్యాల్ని పరీక్షించడం.

Zainab awards
జైనాబ్​ సాధించిన అవార్డులు

ఇందులో నాలుగు స్థాయిలు ఉన్నాయి

  • మొదటిది ప్రాథమిక స్థాయి: ఈ పరీక్ష 8 సంవత్సరాల వయస్సు అంతకంటే ఎక్కువ వారికి.
  • రెండో స్థాయి: 11 ఏళ్లు పైబడిన వారికోసం.
  • మూడో స్థాయి: టోఫెల్​ ఐటీపీ- 16 ఏళ్లు పైబడిన వారికి సంబంధించింది.
  • నాలుగో స్థాయి: టోఫెల్​ ఐబీటీ: గ్రాడ్యుయేషన్​, పోస్టు గ్రాడ్యుయేషన్​లో ప్రవేశం పొందే వారి కోసం ఉద్దేశించింది.

టీఓఈఎఫ్​ఎల్​(టోఫెల్​): టెస్ట్​ ఆఫ్​ ఇంగ్లీష్​ యాస్​​ ఏ ఫారెన్​ లాంగ్వేజ్​.

ఇదీ చదవండి: పర్యటకులను ఆకర్షిస్తోన్న 'తులిప్​' అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.