ETV Bharat / bharat

రైతన్న పోరు: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్​ బంద్ - దిల్లీలో రైతుల నిరసన

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో చేపట్టిన నిరసన సెగ నేడు యావత్‌ భారతావనిని తాకనుంది. కొత్త సాగుచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఇవాళ భారత్ ‌బంద్‌కు రైతన్నలు పిలుపునిచ్చారు. సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా బంద్‌ను పాటిస్తామని రైతు సంఘాలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. బంద్‌ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రైల్వేలు మార్గదర్శకాలు జారీచేశాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాలపై బంద్‌ ప్రభావం పడనుంది.

Bharat Bandh
భారత్​ బంద్
author img

By

Published : Dec 8, 2020, 5:31 AM IST

నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్న డిమాండ్‌తో సంకల్పించిన నేటి భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు సర్వ సన్నద్ధమయ్యాయి. సాగు చట్టాలపై వ్యతిరేకత సహా తమ ఐక్యతను మాత్రమే ప్రదర్శిస్తూ సామాన్యులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నిరసన తెలిపేందుకు కర్షకులు సిద్ధమయ్యారు. తాము తలపెట్టిన బంద్ రాజకీయ పార్టీల బంద్‌ వంటిది కాదని రైతుసంఘాలు ఇప్పటికే స్పష్టంచేశాయి.

రోడ్డు దిగ్బంధం వంటి నిరసనలు 3 గంటల వరకే జరుగుతాయని రైతు సంఘాలు వెల్లడించాయి. దీని ద్వారా సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బంద్‌ సమయంలో ప్రయాణాలు చేయవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపాయి. ఇప్పటివరకు తమ ఆందోళనలు శాంతియుతంగానే సాగాయని ఇకపైనా అదే విధంగా ఉంటాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికైట్‌ చెప్పారు.

బంద్‌లో పాల్గొనాలని ఎవరినీ బలవంతం చేయకూడదని రైతు సంఘాలు సూచించాయి. అత్యవసర సేవలు, నిత్యావసర సేవలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని వివాహాలను అడ్డుకోవద్దని రైతుల సంఘాల ప్రతినిధులు సూచించారు. తమ ఆందోళనల్లో రాజకీయాలకు తావు లేదని, రాజకీయ నేతలకు తమ వేదికలపై అనుమతి లేదని రైతుసంఘాలు తేల్చిచెప్పాయి. ఆరో విడత చర్చలకు ముందు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని రైతుసంఘాలు కోరాయి.

తీవ్ర ప్రభావం!

భారత్‌ బంద్‌ ప్రభావం పలు రంగాలపై పడనుంది. బంద్‌ సమయంలో రవాణా నిలిచిపోయే అవకాశం ఉన్నందున, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం ఉండనుంది. దేశరాజధాని దిల్లీలో నిత్యావసర సరుకుల రవాణాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అటు రైల్వేలపై కూడా బంద్‌ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో రైలుదిగ్బంధం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయని భారతీయ రైల్వే అంచనా వేస్తోంది. ఈ మేరకు, స్టేషన్లు, రైళ్లలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. వామపక్ష తీవ్రవాదులు నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని జోనల్‌రైల్వేలను అప్రమత్తం చేసింది.

బంద్‌ నేపథ్యంలో జోనల్‌ రైల్వేల జనరల్‌ మేనేజర్లను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని చెకింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు ట్యాక్సీలు, క్యాబ్‌లు నిలిచిపోనున్నాయి. అయితే రోడ్డు దిగ్బంధం వంటి కార్యక్రమాల ద్వారా పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీ, హరియాణా పోలీసులు ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు.

మార్గదర్శకాలు..

భారత్‌ బంద్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. నిరసనలు శాంతియుతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా నిబంధనలకు కూడా అమలు చేయాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.