ETV Bharat / bharat

TSPSC Paper Leak Case Update : 'హైటెక్ మాస్​కాపీయింగ్​లో మాజీ ఎంపీటీసీ కుమార్తె' - టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్​ కేసు

SIT Investigation in TSPSC Paper Leak Case : టీఎస్​పీఎస్సీ పేపర్ల లీక్​​ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో కరీంనగర్​ జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త ప్రమేయం ఉన్నట్లు తేలింది.

TSPSC Paper Leak Case Update
TSPSC Paper Leak Case Update
author img

By

Published : Jun 6, 2023, 9:37 AM IST

Updated : Jun 6, 2023, 9:59 AM IST

EX MPTC Involved in TSPSC Paper Leak Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్​ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ఈ పేపర్లు కొనుగోలు చేసినట్లు బహిర్గతమైంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త ప్రమేయం ఉన్నట్టు హైదరాబాదా నగర సిట్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తన కుమార్తె ఏఈఈ పరీక్ష కోసం హైటెక్ మాస్​కాపీయింగ్ సూత్రధారైన డీఈ రమేశ్ సహకారం తీసుకున్నట్టు నిర్ధారించారు.

SIT Inquiry in TSPSC paper leakage case : ఏపీలోని అన్నమయ్య జిల్లా బీరంగి కొత్తకోటకు చెందిన పూల రమేశ్(47).. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో నీటిపారుదల శాఖలో (ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) అసిస్టెంట్ ఇంజినీర్​గా పనిచేస్తున్నారు. సైదాబాద్​లో నివాసం ఉంటున్నారు. అతను ద్వారా 70 మందికి పైగా ఏఈ ప్రశ్నపత్రాలు చేతులు మారాయి. మలక్‌పేట్‌ కేంద్రంగా ఎనిమిది మంది సహాయకులతో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి ఏఈఈ, డీఏవో పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలను చేరవేశారు. అయితే పోలీసులు రమేశ్​ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. విచారణలో నిందితుడు తాను ప్రజాప్రతినిధితో ఒప్పందం చేసుకున్నట్టు అంగీకరించాడు.

రూ.75 లక్షలకు ఒప్పందం : కరీంనగర్​ జిల్లా బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలత భర్త శ్రీనివాస్​కు హైటెక్ మాస్​కాపీయింగ్ డీఈ రమేశ్​తో పరిచయం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న శ్రీనివాస్ కుమార్తె కోసం రమేశ్​ను కలిశాడు. ఏఈఈ పరీక్షకు సహకరిస్తే.. రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం వచ్చాకే డబ్బులిస్తామని షరతు కూడా విధించాడు. ఈ మేరకు ఫిబ్రవరి 26వ తేదీన శ్రీనివాస్ కుమార్తెతో పరీక్షను రాయించాడు.

TSPSC paper leak case Updates : గుట్టుగా సాగిన వ్యవహారం బయటకు రాగానే మాజీ ఎంపీటీసీ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సోమవారం సిట్ పోలీసులు బొమ్మకల్​లోని వారి నివాసానికి వెళ్లి తనిఖీలు చేసి పరికరాలు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. డీఈ రమేశ్​కు సహకరించిన టోలిచౌకి ప్రాంతానికి చెందిన ప్రిన్సిపల్ అలీ పరారీ ఉన్నాడు. అతను ముందస్తు బెయిల్​ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

హైటెక్ మాస్​కాపీయింగ్: మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేశ్‌ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సహా హైటెక్ మాస్‌ కాపీయింగ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఏఓ, ఏఈఈ పరీక్షల్లో హైటెక్‌ మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన రమేశ్‌.. దాదాపు 7 మంది అభ్యర్థులకు జవాబులను అందించాడు. అందుకోసం ముందే పరీక్షా కేంద్రం నిర్వాహకుడిని బుట్టలోకి దింపాడు. ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.30 లక్షలు తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. రమేశ్ సాయంతో పరీక్షలు రాసిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.