ETV Bharat / bharat

TSPSC Group 2 Exam Reschedule Dates : గ్రూప్‌- 2 పరీక్ష రీషెడ్యూల్‌.. కొత్త తేదీలివే - తెలంగాణ గ్రూప్‌ 2 రీషెడ్యూల్‌

TSPSC Group2
TSPSC Group 2 Exam Reschedule Dates
author img

By

Published : Aug 13, 2023, 6:07 PM IST

Updated : Aug 13, 2023, 7:05 PM IST

18:02 August 13

TSPSC Group 2 Exam Reschedule Dates : నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్‌- 2 పరీక్షల నిర్వహణ

TSPSC Group 2 Exam Reschedule Dates : నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్‌-2 పరీక్షలను రీ-షెడ్యూల్ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు , మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

గ్రూప్‌ -2 కు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్‌ -2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్‌ -2(Telangana Group 2 Exam) పరీక్షలు వాయిదా కోసం అభ్యర్థులు, విపక్ష నేతలు ఇటీవల ఆందోళనలు చేపట్టారు. లక్షల మంది అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట

TSPSC Group 2 Exam 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో సీఎం కేసీఆర్‌ గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేసి.. రీషెడ్యూల్‌ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో చర్చించి నవంబరుకు గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలుపుతూ.. నేడు పరీక్ష తేదీల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

కేటీఆర్‌ ట్వీట్‌ : టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌2 పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. అనంతరం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ సీఎస్‌ను ఆదేశించారు. అందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా నియామక ప్రకటనల జారీలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సూచించినట్లు మంత్రి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

TSPSC Clarity on Group 2 Exams Postpone : 'గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆగస్టు 14న నిర్ణయం'

గ్రూప్‌ 2 వాయిదాకు అభ్యర్థులు ఆందోళనలు : గురువారం గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని ముట్టడించి.. ఆందోళనలు చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. గురుకుల పరీక్షలు ఈ నెల 29,30 తేదీల్లో ఉండడం వల్ల గ్రూప్‌2 పరీక్షకు కొంత మంది విద్యార్థులు హాజరు కాలేరని అందుకు వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీని కోరారు.

Telangana Group 2 Exam : 150 మంది అభ్యర్థులు హైకోర్టులో గ్రూప్‌ 2 వాయిదా వేయమని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు టీఎస్‌పీఎస్సీ సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. గ్రూప్‌ 2 పరీక్షను దాదాపు 5.50 లక్షలు మంది రాయనున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో నేడు నవంబరు నెలకు వాయిదా వేస్తూ.. ఆ నెల 2,3 తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

TSPSC Group-2 exam postponed to November : గ్రూప్‌- 2 పరీక్ష నవంబర్‌ నెలకు వాయిదా

TSLPRB Focus On Police Candidates Training : అక్టోబర్​లో కానిస్టేబుళ్లకు శిక్షణ! 28 కేంద్రాల్లో ఏర్పాట్లు

Last Updated : Aug 13, 2023, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.