ETV Bharat / bharat

రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్​

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమంపై కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో.. మాట మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన ఫోన్ సంభాషణలో.. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.

Trudeau commended India
రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్​
author img

By

Published : Feb 12, 2021, 9:28 PM IST

భారత్​లో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్​ ట్రూడో యూటర్న్ తీసుకున్నారు. రైతులతో ప్రభుత్వం వివిధ దశల్లో చర్చలు జరడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ట్రూడో.. ఫోన్​లో సంభాషించారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

'రైతులతో ప్రభుత్వం చర్చలు జరపడం.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సరైన చర్యగా' ట్రూడో పేర్కొన్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు.

మోదీతో ఫోన్​లో మాట్లాడిన ట్రూడో.. తమ దేశానికి వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని కోరారు. అందుకు మోదీ అంగీకరించారు. వాతావరణ మార్పు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై పరస్పర సహకారం, కరోనా నిర్మూలన వంటి వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

అయితే.. అంతకుముందు.. రైతు నిరసనలకు జస్టిస్​ ట్రూడో మద్దతు తెలపడం గమనార్హం.

ఇదీ చదవండి:మరోసారి నోరుపారేసుకున్న కెనడా ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.