టీఆర్పీ అవకతవకల కేసుకు సంబంధించి ఆదివారం అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) వికాస్ ఖాన్‌చందానీకి ముంబయి మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు వికాస్ తరఫు న్యాయవాది నితీన్ ప్రధాన్ తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ) పోలీసులు ఇప్పటివరకు 13మందిని అరెస్టు చేశారు.
టీఆర్పీల కోసం కొన్ని ఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయంటూ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్).. పలు మీడియా సంస్థలపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీఆర్పీలు పెంచుకోవటానికి కొన్ని కుటుంబాలకు డబ్బులు ఇచ్చి మరీ.. తమ ఛానళ్లను చూసేలా మీడియా సంస్థలు చేస్తున్నాయంటూ బార్క్ ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి : టీఆర్పీ స్కామ్ కేసులో రిపబ్లిక్ టీవీ సీఈఓ అరెస్ట్