త్రిపురలో నాణ్యమైన, ఖరీదైన తేయాకుగా పేరుగాంచిన 'నీర్ మహాల్ టీ'.. త్వరలో డెన్మార్క్‌కు ఎగుమతి కానుంది. ఈ తేయాకును డెన్మార్క్‌కు ఎగుమతి చేసేందుకు అమ్రిత్సర్కు చెందిన షాహ్జాదా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. దీని ధర కిలో రూ. 12,500 కాగా.. రూ. 65 వేలకు ఐదు కిలోలను కొనుగోలు చేసినట్లు త్రిపుర టీ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ దిగంత బర్మాన్ తెలిపారు. ఈ రకం.. టీ ఆకులు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని.. చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్లే సామర్థ్యం ఈ తేయాకుకు ఉందన్నారు.
సంప్రదాయ పద్ధతిలో..
త్రిపురలోని 'నీర్ మహాల్ టీ'కి అంత డిమాండ్ ఉండటానికి కారణం.. ఈ తేయాకును సంప్రదాయ పద్ధతిలో చేతితోనే చేస్తారు. టీ ఆకులను చెట్టునుంచి కోసిన తర్వాత.. చేతితో నలిపి.. ఎండబెడతారు.
ఈ సంప్రదాయ తేయాకును త్రిపుర ఉన్నకోటి జిల్లా కైలాష్నహార్.. పంచమ్ నగర్ టీ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు.
ఇదీ చదవండి : లైవ్ వీడియో: గ్రామస్థులను చితకబాదిన పోలీసులు