త్రిపురలో నేడు (గురువారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు (Tripura Civic Polls) సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 785 మంది అభ్యర్థులు పోటీచేయనున్నారు. 770 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు (Tripura Civic Polls) కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఈనెల 28న (ఆదివారం) ఉదయం 8 గంటలకు జరగనుంది.
పార్టీ-పోటీ చేస్తున్న స్థానాలు
- తృణమూల్ కాంగ్రెస్- 120
- భాజపా-334
- సీపీఐ-6
- సీపీఐ(ఎం)-197
- కాంగ్రెస్-92
- రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ- 2
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-3
- ఇతరులు-10
- స్వతంత్రులు -21
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు (Tripura Civic Polls) అన్ని విధాల భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు వెల్లడించారు. 644 పోలింగ్ కేంద్రాల్లో 370 కేంద్రాలను కేటగిరీ ఏ, 274 కేంద్రాలను కేటగిరీ బీ కింద విభజించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
అంతకుముందు.. 36 స్థానాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
- 20 స్థానిక సంస్థలకు ఉన్న 334 నియోజకవర్గాల్లో 8 స్థానాలు ఎస్టీలకు, 85 స్థానాలు ఎస్సీలకు, 157 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ ఉంది.
- ఈ ఎన్నికల్లో మొత్తం 5,94,772 ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉండటం గమనార్హం. 2,93,979 మంది పురుషులు ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 3,00,777గా ఉంది. ఇతరుల సంఖ్య 16గా ఉంది.
ఇదీ చూడండి : మోదీతో దీదీ భేటీ.. ఆ నిర్ణయం వాపస్ తీసుకోవాలని విజ్ఞప్తి