- మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- నాగాలాండ్‌లో స్పష్టమైన ఆధిక్యంలో ఎన్‌డీపీపీ-భాజపా కూటమి
- త్రిపురలో భాజపా ఆధిక్యం, మేఘాలయలో హంగ్ దిశగా ఫలితాలు
త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా కూటమి ఆధిక్యం.. మేఘాలయలో హంగ్! - మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు
09:25 March 02
07:46 March 02
త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా కూటమి ఆధిక్యం.. మేఘాలయలో హంగ్!
మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్), బంగాల్లోని సాగర్దిఘి, ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సైతం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని కస్బా పేఠ్, చించ్వాడ్ నియోజకవర్గాల ఫలితాలు సైతం ఈరోజే వెల్లడి కానున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..
నాగాలాండ్, త్రిపురలో భాజపా ఉన్న కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. త్రిపురలో 87.76 శాతం ఓటింగ్ నమోదు కాగా.. నాగాలాండ్‌లో 85.90శాతం, మేఘాలయలో 85.27 శాతం ఓటర్లు ఎన్నికల్లో భాగమయ్యారు.
మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 21 లొకేషన్లలో ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. సోహియోంగ్ స్థానంలో ఎన్నిక వాయిదా పడగా.. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు, నాగాలాండ్‌లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవమైంది. అక్కడ కూడా 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.