Tribal Women Assault by Jawans: ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లాలో ఆదివాసీ మహిళలపై జవాన్లు వేధింపులకు పాల్పడ్డారనే ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాలు ఆపరేషన్లో భాగంగా తమ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని పసునుర్ వడ్డె పరా గ్రామస్థులు ఆరోపించారు. తమ గుడిసెలను ఖాళీ చేయించారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మూలవాసీ బచావో మంచ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. నిరసన తెలిపే తమను పోలీసులు హింసించారని ఆరోపించారు.
ఓ క్రమంలో భద్రతా బలగాలు తమపై రాకెట్ లాంచర్లు ప్రయోగించాయని గ్రామస్థులు తెలిపారు. అయితే.. అవి పేలని కారణంగా వాటిని తామే భద్రపరిచినట్లు వెల్లడించారు.
2020 డిసెంబర్లోనూ ఇలాంటి ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసు క్యాంపులకు వ్యతిరేకంగా ఆందోళన జరిపిన ప్రజలపై బలగాలు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. గిరిజన మహిళలపై కూడా దాడులు చేశారని చెప్పారు.
ఇదీ చదవండి: భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి.. పౌరుడు మృతి