Traffic Rules Violation Fine Bangalore : ఓ వ్యక్తి ఒకే స్కూటర్‌తో 643 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఆయనకు పోలీసులు రూ. 3.22 లక్షల జరిమానా విధించారు. ఈ ఘటన కర్ణాటక జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
బెంగళూరులోని గంగాదరనగర్కు చెందిన ఓ వ్యక్తికి KA04KF9072 నంబర్ గల బైక్ ఉంది. అయితే గత రెండేళ్లుగా హెల్మెట్ లేకుండా బైక్‌పై అతడు ప్రయాణించడమే కాకుండా, ఇతర వ్యక్తులకు తన బైక్ ఇచ్చాడు. ఈ క్రమంలో 643 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో బైక్ యజమానికి రూ. 3.22 లక్షల జరిమానా విధించినట్లుగా పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. ఇందుకోసం నగరంలోని ప్రతి జంక్షన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి సహాయంతో ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన బైక్ మీద వెళ్లినప్పుడు 643 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారని గుర్తించినట్లుగా వెల్లడించారు.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు రూ.16 వేలు జరిమానా
Traffic Rules Violation Fine Karnataka : ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. గతేడాది కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ఓ బైకర్ 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీంతో అతడికి ట్రాఫిక్ పోలీసులు రూ.16 వేలు జరిమానా విధించినట్లుగా నోటీసులు పంపించారు. ఈ జరిమానాను బైక్ యజమాని వీరేశ్ చెల్లించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
దావణగెరెకు చెందిన వీరేశ్ 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. అందులో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు 23 కేసులు, బైక్ నడుపుతూ ఫోన్లో మాట్లాడినందుకు ఆ వ్యక్తిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఇలా వీరేశ్ ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించి బైక్ నడపడం స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జరిమానా కట్టమని నోటీసులు పంపారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.