Tourist Vehicle Missing in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకులు వాహనం బోల్తా పడింది. వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి వాహనం నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారు.
రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో భార్యను విపత్తు నిర్వహణ బృందం రక్షించగా.. రవిరావు ఆచూకీ ఇంకా లభించలేదు.
Missing: ఉత్తరాఖండ్‌లో నదిలో పడిన పర్యాటకుల వాహనం.. తెలుగు వ్యక్తి గల్లంతు - ఉత్తరాఖండ్‌లో తెలుగు వ్యక్తి గల్లంతు
11:58 July 09
విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి నదిలో వాహనం బోల్తా