జమ్ముకశ్మీర్లో ఉగ్రఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన టాప్ కమాండర్ షామ్ సోఫీని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ మేరకు కశ్మర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు. ముష్కరులకు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి