వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని అన్నారు. అయితే, దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల భయాలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు రైతు సంఘాలకు ప్రతిపాదన పంపినట్లు తెలిపారు.
"మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ మొదలైన సమస్యలపై రైతు సంఘాలకు ప్రతిపాదన పంపించాం. పంట వ్యర్థాల్ని తగలబెట్టడం, విద్యుత్తు వినియోగంపైనా చర్చించేందుకూ ప్రభుత్వం అంగీకరించింది. కానీ, మూడు చట్టాలు రద్దు చేయడమే ముఖ్యమని రైతు సంఘాలు మొండి పట్టుతో ఉన్నాయి."
-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
ఈ నెల 19న జరిగే సమావేశంలో రైతు సంఘాలు క్లాజుల వారిగా చర్చకు సిద్ధం కావాలని సూచించారు తోమర్. చట్టాల్లో ఏ ఏ మార్పులు అవసరమో చెప్పాలని కోరారు.
ఇదీ చదవండి: