ETV Bharat / bharat

Rape: ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లి.. హత్యాచారం!

ఏడాదిన్నర పసికుందుపై హత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు గ్రామస్థులు. అయితే కోర్టుకు తీసుకెళ్తుండగా తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.

Toddler rape and murdered
పసికందుపై హత్యాచారం
author img

By

Published : Jun 22, 2021, 5:33 PM IST

ఏడాదిన్నర పసికందు హత్యాచారానికి గురైన పాశవిక ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బహ్రాయిచ్​ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని పట్టుకున్న గ్రామస్థులు.. పోలీసులకు అప్పగించారు.

అసలేమైందంటే..?

సోమవారం రాత్రి.. బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్న పసికందును ఓ వ్యక్తి ఎత్తికెళ్లి, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంలో అత్యాచారం చేశాడు. తెల్లవారుజామున లేచి చూసిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించపోయేసరికి.. ఆందోళనతో వెతికారు. ఈ క్రమంలో పాడుపడ్డ పాఠశాల భవనంలో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కనిపించింది. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తీవ్రమైన రక్తస్రావంతో మరుసటి రోజు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

నిందితుడిని గుర్తించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని, పోలీసులకు అప్పగించినట్లు ఏస్​ఎస్​పీ అశోక్ కుమార్ తెలిపారు. బాధిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

నిందితుడిపై కాల్పులు

కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు నిందితుడు. దీంతో పోలీసులు.. గాలిలో కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు ఆగకపోవడం వల్ల అతని కాలిపై కాల్చారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి.. వైద్యపరీక్షలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: తండ్రి అకృత్యాలు భరించలేక ఇంటి నుంచి పరార్​.. తర్వాత ఏం జరిగిందంటే.!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.