కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రధాని అధ్యక్షతన వైరస్ వ్యాప్తిపై సమీక్ష జరగనుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రముఖ ఆక్సిజన్ తయారీ సంస్థలతో సమావేశం అవుతారు.
బంగాల్‌లో మరో 2 విడతల్లో పోలింగ్ ఉండగా ప్రచారం నిమిత్తం బంగాల్ వెళ్లాలని మోదీ నిర్ణయించారు. ఐతే కొవిడ్ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దుకాగా సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌గా ప్రచారంలో పాల్గొంటారు.
ఇదీ చూడండి: 'పర్యావరణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు అవసరం'