ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. బాగా కష్టపడాల్సిన సమయం ఇది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది.
ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. ధర్మసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. విష్ణు సందర్శనం శుభప్రదం.
మిశ్రమ కాలం. మనోబలాన్ని కోల్పోవద్దు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీస్తుతి శుభాన్ని ఇస్తుంది.
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు . ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గోసేవ చేయడం మంచిది.
చేపట్టే పనులలో శ్రమ పెరుగుతుంది. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు.
గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలలో, విషయంలోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గా స్తోత్రం చదవాలి.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి.అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివఅష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.
ఇవీ చదవండి: తలాక్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, ఆ రెండూ ఒకటి కాదంటూ