ETV Bharat / bharat

'ఆన్​లైన్​ విచారణ'లో లాయర్​ రాసలీలలు.. జడ్జి ముందే.. - అనుచిత ప్రవర్తన

Advocate Madras high court: ఆన్​లైన్​ విచారణ సందర్భంగా మహిళతో అనుచితంగా ప్రవర్తించి సస్పెండ్​ అయ్యారు మద్రాస్​ హైకోర్టుకు చెందిన ఓ న్యాయవాది. అడ్వకేట్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నివేదిక సమర్పించాలని సీబీ-సీఐడీని ఆదేశించింది కోర్టు.

Madras High Court
మద్రాస్​ హైకోర్టు
author img

By

Published : Dec 22, 2021, 2:09 PM IST

Advocate Madras high court: కరోనా మహమ్మారి కారణంగా హైకోర్టుల్లో వర్చువల్​గా విచారణ జరుగుతోంది. న్యాయవాదులు ఇంటి నుంచే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మద్రాస్​ హైకోర్టుకు చెందిన ఓ అడ్వకేట్​ ఆన్​లైన్​ విచారణలో ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. కోర్టు ఆగ్రహానికి గురై సస్పెండ్​ అయ్యారు.

రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్సింగ్​ ద్వారా మద్రాస్​ హైకోర్టు సింగిల్​ జడ్జ్​.. ఓ కేసు విచారణ చేపట్టారు. ఈ సందర్భంలో చెన్నైకి చెందిన అడ్వకేట్ ఆర్​డీ​ సంతాన కృష్ణన్​.. ఓ మహిళతో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఆ వీడియో వైరల్​గా మారింది.

Madras High Court
విచారణలో న్యాయవాది ఆర్​డీ సంతాన కృష్ణన్

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎన్​ ప్రకాశ్​, జస్టిస్ ఆర్​ హేమలత.. సంతాన కృష్ణన్​పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీబీ-సీఐడీని ఆదేశించారు. డిసెంబర్​ 23న నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. సంతాన కృష్ణన్​ ఎక్కడా ప్రాక్టీస్​ చేయకుండా.. క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని తమిళనాడు బార్​ కౌన్సిల్​ను ఆదేశించారు న్యాయమూర్తులు. అందుకు అనుగుణంగా అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థల్లో ఆ న్యాయవాదిపై నిషేధం విధించినట్లు బార్​ కౌన్సిల్​ ప్రకటించింది.

ఇదీ చూడండి:

ఆ హైకోర్టులో బ్రెయిలీ లిపిలోనూ ఉత్తర్వులు.. ప్రత్యేక ప్రింటర్​ ఏర్పాటు

కుమార్తెను వ్యభిచారం చేయమని బలవంతం.. తల్లికి 10ఏళ్ల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.