ETV Bharat / bharat

'అపోహలను చర్చించి పరిష్కరించుకుంటాం'

పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతూ వ్యాఖ్యలు చేసిన బంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జీ.. టీఎంసీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీతో భేటీ అయ్యారు. పార్టీలో అపోహలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. మరోవైపు, సువేందు అధికారి సన్నిహితుడిపై వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Bengal minister unhappy with TMC affairs meets party secy gen
'పార్టీలో అపోహలు చర్చించి పరిష్కరించుకుంటాం'
author img

By

Published : Dec 13, 2020, 10:43 PM IST

పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వెళ్లగక్కిన బంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జీ.. టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీతో ఆదివారం సమావేశమయ్యారు. టీఎంసీ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. పార్టీలో ఏదైనా అపోహలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కోల్​కతాలోని ఛటర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది.

"సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి నన్ను పిలిచారు. భవిష్యత్ వ్యూహాలపై సమావేశంలో చర్చించాం. ఇలాంటి సమావేశాలు, చర్చలు ఇంకా జరుగుతాయి."

-రాజీవ్ బెనర్జీ, టీఎంసీ మంత్రి

టీఎంసీ కీలక నేత సువేందు అధికారితో కలిసి ఉన్న పోస్టర్లపై స్పందించారు రాజీవ్. ఇద్దరికీ వేర్వేరు సమస్యలు ఉన్నాయని.. వీటిని కలిపి చూడొద్దని అన్నారు. ఆ పోస్టర్లు ఎవరు అతికించారో తెలీదని, దానికి తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు.

డిసెంబర్ 5న జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీపై అసహనం వ్యక్తం చేశారు రాజీవ్. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసే వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు. ఏసీలలో కూర్చొని ప్రజలను మూర్ఖులను చేయాలనుకొనే వారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వెనకడుగు వేసేది లేదని డిసెంబర్ 11న మరోసారి స్పష్టం చేశారు. బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఓవైపు భాజపా రాష్ట్రంలో పుంజుకుంటున్న వేళ.. ఈ పరిణామాలు టీఎంసీ వర్గాల్లో గుబులు రేపాయి.

సువేందు సన్నిహితుడిపై వేటు

మరోవైపు, తూర్పు మెదినీపుర్​ జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శి కనిష్క పాండాను పార్టీ నుంచి బహిష్కరించింది టీఎంసీ. పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు అభిషేక్ బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ నాయకత్వంపైనా ప్రశ్నలు లేవనెత్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన కనిష్క పాండా సువేందు అధికారికి సన్నిహితుడు కావడం గమనార్హం.

అయితే పార్టీ నుంచి వెలివేసిన తర్వాత తనకు ఉపశమనం లభించినట్లు ఉందని చెప్పుకొచ్చారు పాండా. నిజాలు మాట్లాడినప్పటికీ.. గత కొద్దిరోజులుగా తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని పేర్కొన్నారు. తాను సువేందు పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. తామిద్దరం కలిసి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో రెండు వారాలుగా తూర్పు మెదినీపుర్​లో సువేందు మద్దతుదారులను పార్టీ పదవుల నుంచి తొలగించడమో, బహిష్కరించడమో చేస్తున్నారు. అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాలతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. టీఎంసీలో దీదీ తర్వాత కీలక నేతగా ఉన్న సువేందు.. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు.

సంబంధిత కథనాలు:

టీఎంసీకి సువేందు షాక్​ ఇవ్వడం ఖాయమా?

'సువేందుది ముగిసిన అధ్యాయం- ఇక మాటల్లేవ్​​'

'సువేందు.. తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.