అసోంలోని మనాస్ అంతర్జాతీయ పార్కులో కొత్తగా మూడు ఖడ్గమృగాలు చేరాయి. శనివారం మూడు పిల్ల ఖడ్గమృగాలను కాజిరంగా పార్కు నుంచి అటవీ అధికారులు తరలించారు. వీటిని.. 2019 అసోం వరదల సమయంలో కాపాడినట్లు పేర్కొన్నారు. అప్పటినుంచి వీటిని ఐఎఫ్ఏడబ్ల్యూ, డబ్ల్యూటీఐ సంస్థలు అటవీశాఖ సహకారంతో చూసుకున్నాయన్నారు.
"మూడు ఖడ్గమృగాల్లో రెండు ఆడ, ఒక మగ ఉన్నాయి. ఖడ్గమృగాలకు కొమ్ములు వస్తున్నాయి.. వాటికి పునరావాసం కల్పించేందుకు ఇదే సరైన సమయం. ఖడ్గమృగాలకు వైద్య పరిక్షలు నిర్వహించి పార్కులోకి పంపిస్తాం."
-- పీ. శివకుమార్, కజిరంగా పార్కు డైరెక్టర్
ప్రస్తుతం మనాస్ పార్కులో 44 ఖడ్గమృగాలు ఉన్నాయని శివకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: కళ్లలో కారం చల్లి 800 గ్రాముల బంగారం చోరీ