ETV Bharat / bharat

లైవ్​ వీడియో: చెట్టుపై పిడుగు.. ఒకరు మృతి - పిడుగు

వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు చెట్టు కిందకు వెళ్లగా దానిపై పిడుగు పడిన ఘటన హరియాణలోని గుడ్​గావ్​లో జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

three people burnt and one died due to lightning in gurugram sector 82
వానలో తడవద్దని చెట్టుకిందకు.. పిడుగు పడి మృతి
author img

By

Published : Mar 13, 2021, 3:48 PM IST

హరియాణలోని గుడ్‌గావ్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు వ్యక్తులు చెట్టు కిందకు వెళ్లగా.. ఆ చెట్టుపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడే కుప్పకూలి చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గుడ్​గావ్​లో పిడుగు

గుడ్‌గావ్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. వానలో తడిసిపోకుండా ఉండేందుకు నలుగురు ఉద్యానవన సిబ్బంది.. ఓ చెట్టు కిందకు వెళ్లగా.. ఆ చెట్టుపై పిడుగు పడింది. క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

పిడుగుపడిన వారిలో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని..... ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వర్షం పడేప్పుడు అందరూ చెట్ల కిందకు వెళుతుంటారుని... వాస్తవానికి ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో చెట్ల నిలబడకూడదని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.