ETV Bharat / bharat

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం - ఘోర కారు ప్రమాదం

Car Accident: ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు.. డివైడర్​ను ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

Car Accident
Car Accident
author img

By

Published : Feb 7, 2022, 8:54 AM IST

Updated : Feb 7, 2022, 9:46 AM IST

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం

Car Accident: ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ జిల్లాలో ఓ కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్వాల్​ కిరి కర్వాట్​ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఏమైందంటే..

లఖ్​నవూ నుంచి ఆజమ్​గఢ్ వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగాయి. దీంతో కారు డోర్​ లాక్​ అయింది. కారులో ఉన్నవారు బయటకు రాలేక.. అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది.

Car Accident
నడిరోడ్డుపై దగ్ధమవుతున్న కారు
Car Accident
దగ్ధమైన కారు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. కారు నంబరు ప్లేట్​ ద్వారా మృతులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఆ పని పూర్తవగానే.. మృతుల కుటుంబాలకు సమాచారం అందించనున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రైలు పట్టాలపై సెల్ఫీలు- ఇద్దరు దుర్మరణం

Last Updated : Feb 7, 2022, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.