ETV Bharat / bharat

ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్ర అనుచరులు అరెస్ట్​ - లష్కరే తోయిబా అనుచరలు

కశ్మీర్​లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అనుచరులను భద్రతా బలగాలు అరెస్ట్​ చేశాయి. వారి నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Three militan aides arrested
లష్కరే తోయిబా ఉగ్ర అనుచరులు
author img

By

Published : Apr 17, 2021, 9:39 PM IST

కశ్మీర్​లో లష్కరే తోయిబా(ఎల్​ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్ర అనుచరులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. బుద్గాం జిల్లాలో పట్టుబడిన వారి నుంచి.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఎల్​ఈటీ పోస్టర్లు, ఇతర అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

అరెస్ట్​ అయిన వారిలో ఇద్దరు(ఆదిల్​ అహ్మద్​ దార్​, తాహిర్​ అహ్మద్​ భట్​) నార్బల్​ వాసులుగానూ, ఒకరు(గులామ్​ మహ్మద్​ గోజ్రే) కవూసా ఖలీసాకు చెందినవాడిగా గుర్తించినట్టు పేర్కొన్నారు.

ఉగ్ర కమాండర్లతో సన్నిహితంగా..

ఈ ఉగ్ర అనుచరులు.. బుద్గాంలోని మాగమ్, నార్బల్​, బీర్వా ప్రాంతాలలో నిషేధిత ఉగ్రసంస్థ(ఎల్ఈటీ)కు ఆయుధ రవాణా, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను సరఫరా చేయడం సహా.. వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు తేలిందని పోలీసులు ప్రకటించారు. వీరు పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదులతో ముఖ్యంగా ఎల్​ఈటీ కమాండర్​ మహమ్మద్​ యూసుఫ్​ దార్​ అలియాస్​ కాంట్రో, అబ్రార్​ నదీమ్​ భట్​లతో.. సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ల ద్వారా సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలిందని చెప్పారు.

ఇదీ చదవండి: వాహనంపై సీఆర్​పీఎఫ్ కాల్పులు- మహిళకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.