కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు(new farm laws) వ్యతిరేకంగా దిల్లీ జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేసేందుకు అనుమతించాలని కోరుతూ కిసాన్ మహాపంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు(Supreme Court news). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సాగు చట్టాలపై స్టే విధించామని, అసలు ఆ చట్టాలు(new farm laws) అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం ప్రశ్నించింది.
" చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనకు ఎక్కడకు వెళ్లాలి అనే ప్రశ్న ఎక్కడ ఉంది? నూతన సాగు చట్టాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రస్తుతం ఆ చట్టాలు అమలులో లేవు. దేనికోసం ఆందోళన చేస్తున్నారు?"
- సుప్రీం కోర్టు.
ఒకసారి సమస్య(new farm laws) అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత.. అదే అంశంపై ఎవరూ రోడ్లపైకి రాకూడదన్నారు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.
'ఎవరూ బాధ్యత వహించరు..'
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక సంఘటనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా.. అలాంటి దురదృష్టకర సంఘటనలకు ఎవరూ బాధ్యత వహించరని వ్యాఖ్యానించింది కోర్టు.
ఇదీ చూడండి: 'కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాల్సిందే'